ఒక్కసారి చూస్తే చాలు జీవితాంతం గుర్తుండిపోయే హిల్స్..చాకొలెట్ హిల్స్‌

ఫిలిప్పీన్స్‌లోని బోహోల్ ఐలాండ్‌లో ఉన్న చాకొలెట్ హిల్స్‌ ప్రకృతి వింతల్లో ఒకటి..

ఒకటీ రెండూ కాదు ఏకంగా17,000 చిన్న చిన్న కొండలు చూడటానికి భలే విచిత్రంగా ఉంటాయి..

అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తూ...బోహోల్ ఐలాండ్‌ ని వరల్డ్ ఫేమస్ చేశాయి..

ఇంత అందమైన ఈ బుజ్జి బుజ్జి కొండలైన చాకొలెట్ హిల్స్‌కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు కూడా దక్కింది.

వీటిని చాకొలెట్ హిల్స్‌ అని ఎందుకంటారంటారో కూడా తెలుసుకోవాల్సిందే..

వేసవిలో పచ్చదనం మటుమాయం అయిపోయి ఈ చిట్టి చిట్టి కొండలు చాకొలెట్ షేపులోకి మారిపోతాయి.

ఎండాకాలంలో కంటే..మిగిలిన కాలాల్లోనే ఈ బుజ్జి బుజ్జి కొండలు చాలా అందంగా కనిపిస్తాయి...

ఫిలిప్పీన్స్‌ వెళితే ఈ  చాకొలెట్ కొండలపై ఓ లుక్కేసి రండీ