చైనాలో ఓ బీచ్ కాని బీచ్ ఉంది అదే ‘రెడ్ బీచ్’..బీచ్ అంటే ఇది సముద్రతీరం కాదు. ఓ నదీ పరీవాహక ప్రాంతం ఒకప్పుడు..

చైనాలోని దవా కౌంటీలో, ల్యోనింగ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ బీచ్ ఎర్ర దుప్పటిని ఆరబెట్టినట్టుగా ఉంటుంది.

ల్యోనింగ్‌లో ఒకప్పుడు చాలా నదులు ఉండేవట. ఇవన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉండేవని..వాటిలో కొన్ని కాలక్రమంలో అంతరించిపోయి.ఆ ప్రాంతమంతా చిత్తడి నేలలుగా మిగిలిపోయాయి.

ఇప్పటికీ చాలా నదులు మిగిలే ఉన్నాయి. అలా మిగిలివున్న పంజిన్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్.

ఈ బీచ్ ఎర్రగా ఉండటానికి కారణం...కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఎరుపురంగు ‘జీనస్ ’ మొక్కలు..

జీనస్ అనేది ఒక రకమైన రెల్లుగడ్డి..ఈ ‘జీనస్’ మొక్కలు..260 రకాల పక్షులకు,366 రకాల వన్యప్రాణులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

జీనస్ గడ్డిమొక్కలు ఎరుపురంగులో ఉంటాయి. కొన్ని కిలోమీరట్ల మేర ఆవరించిన వాటిని చూస్తే, అక్కడి నేలే అంత ఎర్రగా ఉందా అనిపిస్తుంది

పేరుకు ఇది రెల్లు గడ్డే అయినా దీనితో పేపర్ తయారు చేస్తారు. అందుకోసమే ఈ బీచ్‌ను ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు..

జీనస్ మొక్కలు ఏప్రిల్ నుంచి ఎదగడం మొదలుపెడతాయి. ఇవి మరీ ఎత్తుగా పెరగవు. అలా అని మరీ చిన్నగా కూడా ఉండవు.

ఈ గట్టి మొదట పచ్చగానే ఉన్నా... పెరిగేకొద్దీ ఎరుపురంగుకు మారి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎర్రగా మారిపోతుంది.

దీంతో అక్టోబర్ నెలాఖరు నుంచే పర్యాటలకు భారీగా వచ్చి ఈ రెడ్ బీచ్ అందాలను ఆస్వాదిస్తారు.

ఈ మొక్కల్ని ముట్టుకోనివ్వరు..చైనాలో ఈ రెడ్ బీచ్ చాలా స్పెషల్ అందుకే చైనా ఈ కండీషన్ పెట్టింది.

ముట్టుకోకూడదరు గానీ సెల్ఫీలు, ఫొటోలు,వీడియోలు తీసుకోవచ్చు..