తరచూ జలుబు చేస్తోందా?

చలి కాలం ఎక్కువ మందికి వచ్చే సమస్య జలుబు

కొందరికి తరచూ జలుబు చేస్తుంటుంది

ఈ సీజన్ మొత్తం జలుబుతో బాధపడుతూనే ఉంటారు

ఇలా తరచూ జలుబు రాకూడదనుకుంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు డాక్టర్లు

స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయాలి. స్మోకింగ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది

వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఒత్తిడి వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో తరచూ జలుబు వస్తుంటుంది

తగినంత నిద్ర లేకపోయినా వ్యాధి నిరోధకత తగ్గుతుంది. అందువల్ల రోజూ సరిపడినంత నిద్ర పోవాలి

చల్లదనం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందువల్ల రోజంతా వీలైనంత వెచ్చగా ఉండాలి