ఒమిక్రాన్ బీఎఫ్-7 లక్షణాలు ఇవే..

ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం ముఖ్యంగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తోంది. 

దీంతో పాటు జ్వరం, దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం, అలసట లక్షణాలు ఉంటాయి. 

కొంతమంది వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటున్నారు. 

ఇతర కరోనా వేరియంట్ల లాగే..

ఇది కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

బీఎఫ్-7 ఇతర వేరియంట్లతో పోలిస్తే బలంగా ఉంది.

వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన వ్యాధినిరోధక శక్తిని కూడా సవాల్ చేస్తూ.. 

శరీరంలోకి ప్రవేశించి కోవిడ్ వ్యాధికి కారణమవుతోంది.

ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం ముఖ్యంగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తోంది.