చలికాలంలో ఎక్కడ ఉండే తేమ అక్కడ ఉంటుంది.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే దుర్వాస‌న వ‌స్తుంది. 

దుప్పట్లు, కార్పెట్స్‌, దుస్తులు, తువాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

వంట‌గ‌దిలో సింక్ ఉండే ప్రాంతంలో ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.

సింక్‌ ఉండే ప్రాంతంలో నిల్వ ఉండే, కింద పడిన ఆహార ప‌దార్థాలు ఉండ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. 

ఒక‌వేళ ఆహార ప‌దార్థాలు సింక్ వ‌ద్ద ప‌డిఉంటే వాటివళ్ల ఇంట్లో చెడు వాసన వ‌స్తుంది.

అగరబత్తీల వాసన కూడా ఇంట్లోని చెడును పోగొడుతుంది. సువాస‌న‌ను ఇస్తుంది.

రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌ వాడితే చక్కటి ఫలితం ఉంటుంది.

సిట్రస్‌ ఆమ్లం ఉండే నిమ్మ, నారింజ పండ్ల తొక్కలుతీసి బౌల్‌లో వేసుకుని చిన్న మంట మీద ఇరవై నిమిషాలు వేడిచేస్తే.. వాటినుంచి మంచి సువాసన వస్తుంది.

వంటగదిలో చెత్త నిల్వచేసే డబ్బాలు పొడిగా ఉండేట్లు చూసుకోవాలి.

కూరగాయలు, పండ్లు నుంచి వచ్చే వేస్ట్‌ను ఇంట్లో పడకుండా చూసుకోవాలి.

మంచి వాసన ఇచ్చే పూలతో ఇంట్లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.