చ‌లికాలంలో పెదాలు ప‌గుళ్లతో ఇబ్బందులు పెడుతుంటాయి.

ప‌లు ర‌కాల క్రీములు రాసిన‌ప్ప‌టికీ ఫ‌లితం క‌నిపించ‌దు.

ఇంట్లోని కొన్ని చిట్కాల‌తో పెదాల ప‌గుళ్ల‌కు చెక్ పెట్టొచ్చు.

నువ్వుల నూనెను కాస్త వేళ్ల‌కు అద్దుకుని పెదాల‌కు రాసి, మ‌ర్ద‌న చేయాలి.

జిడ్డుగా అనిపించినా.. కాసేప‌టికి పెదాల‌కు త‌గిన తేమ అంది స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.

పెదాల ప‌గుళ్ల‌కు వెన్న‌ను మించిన ప‌రిష్కారం లేదు. 

స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు, అద‌రాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి.

చెంచా వెన్న‌కు చిటికెడు పంచ‌దార చేర్చి సున్నితంగా స్ర్క‌బ్ చేయాలి. 

పెదాలు కాంతిమంతంగా క‌నిపిస్తాయి.

ఇలా కాసేపు చేస్తే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.