డయాబెటిస్‌ ఉన్నవారు తినే ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. 

కొన్ని రకాల ఆహార పదార్థాలు షుగర్‌ను అమాంతం పెంచేసి ఇబ్బంది పెడతాయి.

జీవన విధానంలో, ఆహార నియమాల్లో మార్పుతో షుగర్ నియంత్రణలో పెట్టుకోవచ్చు.

నాన్ వెజ్ ఇష్టపడే వారు చికెన్, మటన్ తినేందుకు కొంచెం ఆలోచిస్తారు.

నాన్ వెజ్ తినవచ్చు. కానీ, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. 

చికెన్ డయాబెటిక్ రోగులకు ప్రోటీన్ అందించే ఆహారం.

ఆరోగ్యకరమైన రీతిలో ఉడికించి, స్వల్పంగా తీసుకోవాలి.

నూనె లేకుండా గ్రిల్‌ చేసిన చికెన్‌ తినడం మంచిది. 

మటన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మటన్ మధుమేహం లేని వారికి,  మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

ఎక్కువ మోతాదులో తినకూడదు. తక్కువగా తీసుకోవాలి.