మాగ్‌పై జాతికి చెందిన పలురకాల పక్షులు ఆస్ర్టేలియా, ఆసియా, దక్షిణ అమెరికాలో కూడా ఉన్నాయి. వాటిలో అందమైన పక్షి తైవాన్‌ బ్లూ మాగ్‌పై.

ముక్కు ఎర్రగా, నల్లని మెడ, శరీరం నీలం రంగులో, డిజైన్‌ వేసినట్లుండే పొడవైన తోక ఉంటాయి. దీని కంఠం మధురం. పంజరాల్లో కూడా పెంచుకుంటుంటారు.

గింజలు, బల్లులు, పురుగులు తిని బతికే ఈ పక్షి పావు కేజీ బరువు, 68 సెం.మీ. పొడవు ఉంటుంది. ఇవి పర్వతాలు, అడవులు, పార్కులు లాంటి పలు ప్రాంతాల్లో జీవిస్తాయి.

ఇవి గుంపులుగా ఉండటానికి ఇష్టపడతాయి. మూడు నుంచి 15 పక్షుల దాకా ఒకే చోట ఉంటాయి.

మూడు నుంచి ఎనిమిది వరకూ గుడ్లు పెడతాయి. ఇవి 19 రోజుల్లో పొదుగుతాయి.

2007 సంవత్సరంలో తైవాన్‌ జాతీయ పక్షి ఏది బావుంటుందని అక్కడి బర్డ్స్‌ అసోషియేషన్‌ వాళ్లు సర్వే నిర్వహిస్తే.. 53 దేశాల నుంచి తైవాన్‌ బ్లూ మాగ్‌పై బావుంటుందని మిలియన్ల ఓట్లు వేశారు.

ఈ పక్షులు తెలివైనవి. ఎంతంటే.. అద్దంలో చూశాక తనకు తాను గర్తుపట్టగలవు.