కషాయాలు అతిగా తాగేస్తున్నారా.. జాగ్రత్త!

కోవిడ్ విజృంభించే సమయంలో ఎక్కువ మంది కషాయాలు తాగడం అలవాటు చేసుకున్నారు

దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. దీంతో కొందరు రోజూ కషాయాలు తాగుతున్నారు

అయితే ఇది అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు

అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది

గుండెలో మంట, కడుపులో ఇన్ఫెక్షన్ రావొచ్చు

లివర్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు

ముక్కులోంచి రక్తం కారే అవకాశం కూడా ఉంది

దీర్ఘకాలిక మలబద్ధకానికి దారితీయొచ్చు

అందువల్ల వైద్యుల సలహా మేరకు కషాయాలు తాగాలి