2022  వెళ్లిపోతోంది. 2023 సంవత్సరం రానుంది. ఈ 2022లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరో..  ఎందుకో తెలుసుకుందాం..

ఆస్కార్‌ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో  కమెడియన్‌ క్రిస్‌ రాక్ ను  హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ ‘చెంపదెబ్బ’ కొట్టారు. అలా క్రిస్‌రాక్‌, విల్‌స్మిత్‌ పేర్లు ప్రపంచ మీడియాల్లో ప్రధానంగా వినిపించాయి.

యుక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‘యుద్ధం’ ప్రకటనతో  ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ యుద్ధం 10నెలులగా కొనసాగుతునే ఉంది.

అత్యంత శక్తివంతమైన దేశమైన రష్యాను ఎదుర్కొంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా వార్తల్లో నిలిచారు. తన దేశ స్వేచ్ఛ కోసం  ఈనాటికి పోరాడుతూ అంతర్జాతీయంగా హీరో అయ్యారు..

అపర కుబేరుడు, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ ‘హస్తగతం’ చేసుకోవడం టెక్‌ రంగాన్ని కుదిపేయటమే కాకుండా ..పలు సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లోనే ఉన్నాడీ మేధావి..

మహమ్మద్‌ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వార్తల్లో నిలిచారు.

భారత రాష్ట్రపతిగా.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా..ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించిన రెండో మహిళగా అరుదైన ఘనత సాధించారు.

70 ఏళ్లు బ్రిటన్‌ను పాలించిన రాణి ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్‌ కింగ్ అయ్యారు 73 ఏళ్ల చార్లెస్‌..

ఇరాన్ లో హిజాబ్‌ వివాదంతో అరెస్ట్ అయిన మహ్సా అమిని పోలీసు కస్టడీలో మరణించడం ఇరాన్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది.

ఈ నిరసనలతో ఇరాన్‌ ప్రభుత్వం దిగొచ్చింది. అమిని మృతికి కారణంగా భావిస్తున్న ‘నైతిక పోలీసు’ విభాగాన్ని రద్దు చేసింది.