చలికాలంలో ప్రతీఒక్కరిని దగ్గు, జలుబు వేదిస్తుంటుంది.
ఉల్లినీళ్లు తీసుకోవటం ద్వారా జలుబు, దగ్గుకు స్వస్తి చెప్పొచ్చు.
రెండు పచ్చి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి, స్టీల్ గిన్నెలో ఉంచాలి.
ఆ గిన్నెలో లీటరుకుపైగా నీటిని చేర్చి గంట నిల్వ ఉంచాలి.
తర్వాత ఆ నీటిని తాగితే దగ్గు, జలుబు నయం అవుతుంది.
ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి మరుసటి రోజూ తాగొచ్చు.
ఉల్లిలో సల్ఫర్ అధికం. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది.
ఉల్లిలో ఫైబర్ , ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 వంటివి మెండుగా ఉంటాయి.
శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి, ఎముకల ఆరోగ్యానికి సాయపడతాయి.
జట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ ఉల్లి సాయపడుతుంది.
సల్ఫర్ అలర్జీలు ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండాలి.