ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా.. మీ కోసమే ఈ కొత్త రూల్స్!
ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ల కోసం దేశంలో కొత్త రూల్స్ రాబోతున్నాయి
ఇకపై ఆన్లైన్ గేమింగ్ రూల్స్ కఠినతరం కాబోతున్నాయి
చాలా మంది వీటి వల్ల తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే
ఈ నష్టాలను నివారించేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తుంది
గేమింగ్ కంపెనీలు దేశంలో కచ్చితంగా ఒక ఆఫీస్ తెరవాలి
ఆన్లైన్ గేమ్ ఆడాలంటే యూజర్లు కేవైసీ పూర్తి చేయాలి
18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు కొన్ని గేమ్స్ ఆడటం కుదరదు
డబ్బు పెట్టి ఆడే గేమ్స్ అయితే, పేరెంట్స్ అనుమతి తీసుకోవాల్సిందే
ఫిబ్రవరి తర్వాత ఈ రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది