త‌ల వెంట్రుక‌లు ఆక‌ర్ష‌ణీయంగా, దృఢంగా ఉండేలా ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త ప‌డుతుంటారు.

జుట్టు దృఢ‌త్వం కోసం కొంద‌రు ప్ర‌తీరోజూ త‌ల‌స్నానం చేస్తుంటారు.

జుట్టు కురులు దృఢ‌త్వానికి ప‌లుర‌కాల షాంపులు, క్రీములు వాడుతుంటారు.

కురులు దృఢ‌త్వానికి కీర‌దోస జ్యూస్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

 కీర దోస‌కాయ‌ను తొక్క‌తీసి స‌న్న‌గా తురిమి జ్యూస్ చేయాలి. 

జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి మ‌ర్ద‌న చేయాలి. 

గంట త‌రువాత సాధార‌ణ షాంపుతో క‌డిగేయాలి.

కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్ కే జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తుంది.

జుట్టు పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

విట‌మిన్ - ఏ సెబ‌మ్ ఉత్ప‌త్తిని పెంచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

పొటాషియం, జింక్‌, మాంగ‌నీస్‌, పాంతోనిక్ యాసిడ్స్ కురుల‌ను దృఢంగా మారుస్తాయి.