ప్రపంచంలో కవలలు ఎక్కువగా ఉన్న నగరాలు చాలానే ఉన్నాయి. కానీ కవలల జనాభా ఎక్కువగా ఉన్న నగరం గురించి తెలిస్తే భలే తమాషాగా ఉంటుంది..అటువంటి నగరం గురించి తెలుసుకుందాం..

అది నైజీరియాలోని ఇగ్బో-ఓరా నగరం.. ఈ నగరంలో ఇంటింటికి కవలలు ఉంటారు.

ఇగ్బో-ఓరా నగరం జనాభా 2.78లక్షలు. ప్రతీ వెయ్యి మంది జనాభాలో 158 మంది కవలలు ఇక్కడ ఉంటారు. అందుకే దీనిని ప్రపంచంలోనే ‘జంట రాజధాని’ అనికూడా పిలుస్తారు.

ప్రపంచ జనాభాలో దాదాపు 1.9శాతం మంది కవలలు ఉన్నారని ఓ సర్వే చెబుతోంది..

కానీ, ఇగ్బో-ఓరాలో దాదాపు ప్రతీ కుటుంబంలోను కవల పిల్లలు ఉంటారు..

ఈ ప్రాంతంలో మహిళల ఆహారపు అలవాట్ల వల్ల కవలలు పుట్టడం ఎక్కువ అని పలు చెబుతున్న అధ్యయనాలు..

ప్రతీయేటా ఈఇగ్బో-ఓరా నగరంలో కవలల పండుగను నిర్వహిస్తారు. ఇందులో వెయ్యి కంటే ఎక్కువ మంది కవల జంటలు పాల్గొంటారు.

ఫ్రాన్స్, చుట్టుపక్కల దేశాల నుంచి కూడా ఈ పండుగలో పాల్గొనడానికి  ఇగ్బో-ఓరా నగరానికి వస్తారు.

కవలల జననాల రేటు యూరప్, అమెరికాతో పోలిస్తే.. ఇగ్బో-ఓరా నగరంలో చాలా ఎక్కువ. ఐరాపోలో ప్రతీ 1000 జననాలకు 16 కవలలుంటారు.

అదే అమెరికాలో 33 కవలల జననాలు ఉంటాయి. కానీ ఇగ్భో- ఓరాలో ప్రతీ వెయ్యి జననాల్లో 158 జననాలు కవలలే ఉంటారు.

భారతదేశంలో కేరళ రాష్ట్రం కోడిన్హి అనే గ్రామంలో కవలలు ఎక్కువగా ఉంటారు. అయితే, ఇగ్బో- ఓరా నగరంలో కంటే చాలా తక్కువే..

కోడిన్హి గ్రామంలో 2వేల కుటుంబాలు ఉంటే..400కుపైగా కవల సోదరులు, సోదరీమణులు ఉంటారు.