భారతజాతి గర్వించే మహనీయుడు యోగి వివేకానంద. దేశ జాగృతికి విశిష్ట కృషి చేసి..తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడు వివేకాదుడి జయంతి రోజు..సమాజాన్ని చైన్య పరిచే గొప్ప మాటలను మననం చేసుకుందాం..

లక్ష్యం కోసం అలుపెరుగ శ్రమిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది..

'ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం', 'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి'

పట్టుదల వదలకుండా చేసే ప్రతీ ప్రయత్నం చివరకు విజయాన్ని అందిస్తుంది. ఒక్క ఒక్కరోజులో దేన్నీ సాధించలేరు.

రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి..లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు..

‘మీరు ఏమనుకుంటారో అదే అవుతారు..మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే.. మీరు బలహీనంగానే మారతారు..అదే మీరు మిమ్మల్ని బలంగా భావిస్తే, మీరు బలంగా మారతారు’..

‘ఓ యువతా మేల్కొనండి..మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు ఆగకండి..’

‘మీరు జీవించి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండండి..అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు’

‘ఒక వ్యక్తి దగ్గర పైసా లేకపోతే అతను  పేదవాడు కాదు..కానీ ఎవరైతే కలలు, ఆశయాలు లేకుండా ఉంటారో వారే అసలైన పేదవాడు..’

‘నీ ముందు ఏముంది.. నీ వెనుక ఏముంది..అనే విషయాలను పట్టించుకోవద్దు.. నీలో ఏముందనేది అనేది మాత్రమే గుర్తించు’..

‘జీవితంలో డబ్బు కోల్పోయినా పర్వాలేదు..కానీ మీ క్యారెక్టర్ మాత్రం కోల్పోవద్దు.. క్యారెక్టర్ కోల్పోతే అంతా కోల్పోయినట్టే..’

గెలిచినప్పుడు పొంగిపోవడం..ఓడినప్పుడు కుంగిపోవడం వద్దు..ఎందుకంటే గెలుపు అనేది అంతం కాదు..ఓటమి చివరి మెట్టు కాదు..’

మోసం చేయడం కంటే ఓటమి పొందటమే గౌరవమైనది..

సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది..కానీ దాని ఫలితం మాత్రం తియ్యగానే ఉంటుంది..