తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే పండుగను పంజాబీలు ‘లోహ్రి’పండుగ పేరుతో జరుపుకుంటారు. ఈ లోహ్రి పంజాబీలకు చాలా ముఖ్యమైనది. ఆ విశేషాలేంటో చూసేద్దాం..

‘లోహ్రీ’ పంజాబ్ ప్రాంతంలో శీతాకాలంలో చెరకు పంట కోతకు వస్తుంది.. ‘లోహ్రీ’  రైతుల 'ఆర్థిక సంవత్సరం'లో చివరిరోజు.

 శీతాకాలం ముగింపును, వేసవి కాలం రాకను సూచించే ఈ పండుగను కొంతమంది సిక్కులు, హిందువులు లోహ్రీని 'లాల్ లోయి' అని కూడా పిలుస్తారు

లోహ్రీ రోజున భోగి మంటలు వెలిగించడం, సాంప్రదాయ దుస్తులను ధరించడం, జానపద సంగీతం, నృత్యాలకు నృత్యం చేయడం వంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో జరుపుకుంటారు.

లోహ్రీ సంవత్సరంలో సుదీర్ఘమైన రాత్రిని సూచిస్తుందని, ఈ పండుగ తరువాత వచ్చే రోజును మాఘి అని పిలుస్తారు.

ఫలవంతమైన పంటను ఇచ్చినందుకు సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలియజేస్తారు..

భోగి మంటల చుట్టూ కుటుంబాలు గుమిగూడి, 'అగ్ని' చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ గౌరవాన్ని చాటుకుంటారు.

భోగి మంటల చుట్టూ తిరుగుతు మంట రాత్రి అంతా ఉండటానికి  పాప్‌కార్న్,పల్లీలు వంటివి మంటల్లో వేస్తారు.

అందరూ ఒకచోట చేరి సాంప్రదాయ ఆహారాన్ని తింటారు. ప్రసాదాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు.ఆనందంగా, సరదాగా నృత్యం, పాటల వేడుకతో రాత్రి పండుగ ముగుస్తుంది.