అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది

అదే.. అమెజాన్ ఎయిర్ సర్వీసు 

ఈ అమెజాన్ ఎయిర్ సర్వీసుల ద్వారా వినియోగదారులకు వేగంగా డెలివరీని చేయవచ్చు

రిటైలర్ బెంగళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌‌తో అమెజాన్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 

ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో అమెజాన్ సొంత ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది.

ఎయిర్ సర్వీసుల ద్వారా చాలా వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుంది. 

టెక్ దిగ్గజం తన కార్గో సర్వీసును ప్రారంభించిన మొదటి మార్కెట్ భారత్ కాదు.

అమెజాన్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులను పొందుతున్న మార్కెట్లలో భారత్ మూడోవది. 

అమెజాన్ ఎయిర్ మొదటిసారిగా 2016లో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

భారతీయ మార్కెట్‌లో రెండు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.