ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియా.. అలాంటి దేశంలో ఒక తార మెరిసింది. క్రికెటర్లకు సమానమైన ఆదరణ, ఫేమ్ సాధించింది. ఆమెనే సానియా మిర్జా. ప్రపంచం ఉర్రూతలూగే టెన్నిస్ ఆటను భారతీయుల నాలుకలపైకి తీసుకువచ్చిన ఘనత సానియాదే. రెండు దశాబ్దాలకు పైగా ఆమె జర్నీకి తొందరలో టాటా చెప్పబోతున్నారు. మరి ఆమె కెరీర్‭లోని కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకుందామా..

ఆరేళ్ల వయసులోనే సానియా టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. తన తండ్రి ఆధ్వర్యంలో 12 ఏళ్ల వయసులో టెన్నిస్ శిక్షణ పొందింది.

మొదటిసారి 2003లో వింబుల్డన్ జూనియర్ ఛాంపియన్‭షిప్ టైటిట్ గెలుచుకుంది.

వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిట్ గెలుచుకున్న మొదటి ఇండియన్ సానియా.

మొదట సింగిల్స్‭తో కెరీర్ ప్రారంభించిన సానియా.. కొంతకాలానికి డబుల్స్ వైపుకు వెళ్లింది.

2004లో సానియాకు అర్జున అవార్డు వచ్చింది.

2009లో మొదటి వుమెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిట్ గెలుచుకుంది.

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‭ను పెళ్లి చేసుకున్నప్పటికీ, భారత్ తరపునే ఆడతానని ప్రకటించి, చివరి వరకు ఇండియాకే ప్రాతినిధ్యం వహించింది.

ఒక మిలియన్ అమెరికా డాలర్లు సంపాదించిన మొదటి ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియానే.

ఒకానొక సమయంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గా సానియా నిలిచింది.

మెల్‭బోర్న్‭లో కెరీర్ ప్రారంభించిన సానియా, వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో చివరి టోర్నమెంట్‌ ఆడనుంది.