చద్దన్నంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..

అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్‌, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చ‌ద్దన్నంలో ఆ పోష‌కాల పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయి.

రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది.

చ‌ద్దన్నంలో బీ6, బీ12 విటమిన్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అందుకే చ‌ద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది.

చద్దన్నంతో శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా కావాల్సినంత  ల‌భిస్తుంది. శ‌రీరంలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది.

తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్ శరీరానికి అందుతుంది. దీని వల్ల మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.

చద్దన్నం తింటే బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో ఆందోళనను తగ్గుతుంది. శ‌రీరం ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది.

చద్దన్నం తింటే శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే త‌గ్గిపోతాయి.

రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడు పెట్టుకుంటే  తెల్లారేస‌రికే తోడ‌న్నం త‌యార‌వుతుంది.

ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని గానీ, చ‌ల్లలో నాన‌బెట్టిన అన్నం ఉల్లిముక్కలు,పచ్చిమిర్చి టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకుని మిరియాలు వేసి తాలింపు పెట్టుకుంటే రుచి పెరుగుతుంది ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

కాగా చ‌ద్దన్నాన్ని తప్పనిసరిగా ఉదయమే తినేయాలి. ఆలస్యం చేస్తే అది ఎక్కువ‌గా పులిసి అనారోగ్యం బారిన‌ప‌డే ప్రమాదం ఉంది. సో నిపుణుల సలహాలను పాటిస్తూ చద్దన్నం తినాలి..