అచ్చం పిచ్చుకలాగే కనిపించినప్పటికీ కాస్త భిన్నంగా, ఇంకాస్త అందంగా కనిపించే ఈ చిట్టి పక్షి పేరు ‘రాబిన్‌’

మగ పక్షి స్వరం అద్భుతంగా ఉంటుంది. కోయిల్లా రాగాలు తీస్తుంది.. అది కూడా రాత్రిపూట మాత్రమే

12.5 సెం.మీ నుంచి 14 సెం.మీ పొడవు ఉంటుంది. కేవలం 25 గ్రాముల బరువు ఉంటుంది

ఒక్కో కాంటినెంట్‌లో ఒక్కో రంగుతో కనిపిస్తాయివి. అయితే అమెరికాలో, యూర్‌పలో రాబిన్స్‌ ఎక్కువ. జపాన్‌లోని మంచుకొండల మధ్య జీవించే రాబిన్‌ పక్షులు స్ర్టాంగ్‌గా ఉంటాయి

రష్యా ప్రాంతంలో ఉండే రాబిన్‌ పక్షులు బ్రిటన్‌తో పాటు ఇతర యూరప్‌ దేశాలకు వలసవెళ్తాయి

ఇవి పోస్ట్‌బాక్సుల్లోనూ, పాడుబడిన షూల్లో, పాత విమానాల ఇంజిన్లలో.. ఇలా పలుచోట్ల గుడ్లు పెడతాయి. ఆరునుంచి ఏడు గుడ్లు పెడతాయివి. ఒక్కో గుడ్డు పొడవు ఒకటిన్నర సెం.మీ. ఉంటుంది

బ్రిటన్‌ అయితే ఈ పక్షిని 1960, 2015లో జాతీయపక్షిగా నిర్ణయించింది. అయితే అధికారికంగా దీని పేరు చేర్చలేదు

ఇవి తమ ప్రతిబింబాలను వాహనాల అద్దాలమీద చూసుకున్నప్పుడు ముక్కుతో వేగంగా అద్దాలను పొడుస్తాయి. ఆ సమయంలో యాంగ్రీబర్డ్‌ అంటారెవరైనా

చలికాలంలో వచ్చే గాలుల్ని తట్టుకునే శక్తి ఈ బుల్లిపిట్టకు ఉంది

పార్కులు, తోటల్లో జీవిస్తాయి. వీటి జీవనకాలం నాలుగేళ్లు

ఒక పక్షి మాత్రం 13 ఏళ్లు బతికింది. అదే అత్యధిక జీవనకాలం. ఇపుడు వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది