అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా డెబ్యూట్ చేశాడు.

అయితే అంతకంటే ముందు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఆడియన్స్‌కి పరిచయం అయ్యాడు.

1985 లో వచ్చిన చిరంజీవి విజేత సినిమాలో మొదటిసారి వెండితెరపై కనిపించాడు.

ఆ తరువాత కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు.

ఈ సినిమా తరువాత 18 ఏళ్ళ వయసులో చిరంజీవి డాడీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు.

ఈ సినిమాలోనే తన డాన్సింగ్ స్కిల్స్ చూపించి మెగా ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకున్నాడు.

ఈ మూడు సినిమాలు తరువాత గంగోత్రితో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.