Indian drugsపై నిషేదం ఎత్తేసిన పాకిస్తాన్

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 03:07 AM IST
Indian drugsపై నిషేదం ఎత్తేసిన పాకిస్తాన్

కేసులు పెరుగుతుండటంతో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది పాకిస్తాన్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్, విటమిన్స్ వంటి మందులు కొవిడ్ 19 లాంటి వ్యాధి ట్రీట్‌మెంట్‌లో వాడుకునేందుకు నిషేదాన్ని తొలగించింది. 

పాకిస్తాన్ గవర్నమెంట్ రా మెటేరియల్ తో పాటు, మెడిసిన్స్ ను దిగుమతి చేసుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది కేవలం మహమ్మారి ప్రభావం ఏ మేర ఉంటుందో తెలియక మాత్రమే. అక్కడ ఎటువంటి మందుల కొరత లేదని ఓ ఇంగ్లీష్ మీడియా రాసుకొచ్చింది. 

ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా ఏర్పాటు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019 ఆగష్టు 9న ఇండియాతో అన్ని వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది. కానీ, ఇండియా నుంచి క్లియరెన్స్ లో భాగంగా వస్తువులు కొనుగోలు చేయడంతో ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ పాకిస్తాన్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. 

పాకిస్తాన్ మినిస్ట్రీకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్) ఆధారంగా.. పాకిస్తాన్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పోర్టల్ ద డాన్ విటమిన్లు, డ్రగ్స్, మెడిసిన్ కు సంబంధించిన లవణాలను ఇండియా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపింది. 

Read Here>> 80ఏళ్లు దాటితే విమానాల్లోకి నో ఎంట్రీ, ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే..