ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.

ఉచితంగా ఆధార్ అప్ డేట్ గడువు పెంపు.

ఫ్రీ ఆధార్ అప్‌డేట్ అవకాశం మరో 3 నెలలు పొడిగించిన యూఐడీఏఐ. 

సెప్టెంబర్ 14, 2023 వరకు ఇక ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. 

ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి.

ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.

పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. 

ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

జూన్ 14 వరకే ఉన్న ఈ అవకాశం ఇప్పుడు సెప్టెంబర్ 14 వరకు లభించింది. 

ఆన్‌లైన్ ద్వారా మీ ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు..

https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.