420 అంటే ఏంటి? అలా ఎందుకు అంటారో తెలుసా?

సినిమాల్లో కూడా 420 పదం చాలా ఫేమస్.

అసలు 420 అంటే ఏమిటి? దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

420 అనేది భారతీయ శిక్షాస్మృతిలోని(IPC) ఒక భాగం.

ఇతరులను మోసం చేసే వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు.

మోసాలు చేసే వారిని ఇలా(420) పిలుస్తాం.

అందుకే ఎవరైనా మోసం చేసినప్పుడు వారిని 420 అని సంబోధిస్తారు.

సెక్షన్ 420 ప్రకారం సదరు వ్యక్తి తప్పు చేసినట్లుగా తేలితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష ఉంటుంది.

శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది.

ఇదే శిక్షాస్మృతి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కూడా అమల్లో ఉంది.

దీనికి కారణం ఈ దేశాల శిక్షాస్మృతి బ్రిటీష్ ఇండియా వలస ప్రభుత్వ పాలనలో రావడమే.