Skanda Collections : రెండో రోజు ‘స్కంద’కు ఊహించని కలెక్షన్స్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన సినిమా ‘స్కంద’. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
Skanda Second Day Collections : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన సినిమా ‘స్కంద’. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రామ్‌ని ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత మాస్‌గా చూపించారు. శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. అయితే.. రెండో రోజు సగానికిపైగా తగ్గినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.27.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. మొదటి రోజు ఈ సినిమా రూ.18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించగా రెండో రోజు 9.4 కోట్ల వసూళ్లనే సాధించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరు భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం వీకెంట్ అయ్యేసరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..? థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నిప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది.
Lucifer 2 : మోహన్‌లాల్ ‘లూసిఫర్2 :ఎంపురాన్’.. అబ్రహాం ఖురేషి వచ్చేస్తున్నాడు
సినిమా విడుదలైన నెల తరువాతనే ఓటీటీలో రానున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన అక్టోబర్ చివరి వారంలో దసరా కానుకగా స్కంద సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.