Boyapati Srinu : బాబోయ్ బోయపాటి లైనప్ చూశారా.. సూర్య, బన్నీ, మహేష్.. ఇన్ని సినిమాలా?
స్కంద సక్సెస్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోయపాటి తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు.
Boyapati Srinu Movies : టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. బోయపాటి మొదటి సినిమా భద్ర నుంచి కూడా ఆయన సినిమాలు ఊహకి అందనట్టుగా ఉంటాయి. అన్ని సాధారణ కథలే అయినా మాస్ ని డబల్ చేసి లాజిక్స్ లేకుండా B C సెంటర్స్ ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా సినిమాలు తీస్తారు. ఇక బోయపాటి సినిమాల్లో ఫైట్స్ అయితే మరో రేంజ్ లో ఉంటాయి. ఏ డైరెక్టర్ కూడా అలా ఫైట్స్ డిజైన్ చేయించుకోలేడు అనేవిధంగా తీస్తారు.
ఇక బోయపాటి -బాలయ్య(Balayya) కాంబో అయితే సూపర్ హిట్ హ్యాట్రిక్ కాంబో. ఈ కాంబోలో ఇంకా సినిమాలు రాబోతున్నాయి. ఇటీవలే బోయపాటి శ్రీను రామ్(Ram Pothineni) తో స్కంద(Skanda) సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఇందులో రామ్ ని ఎప్పుడూ చూడని విధంగా ఫుల్ మాస్ గా చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్కంద సక్సెస్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోయపాటి తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు.
Also Read : Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకు హీరోగా ఫస్ట్ మూవీ.. వెరైటీ టైటిల్‌తో.. లాంచ్ చేసిన రాజమౌళి..
బోయపాటి లైనప్ లో బాలయ్యతో అఖండ 2 ఎప్పుడో ప్రకటించారు. కానీ దీనికంటే ముందు హీరో సూర్యతో ఒక సినిమా, అల్లు అర్జున్ తో సినిమాలు ఉన్నాయి. అలాగే మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో కూడా సినిమాలు ఉన్నాయని తెలిపారు. ఆల్రెడీ మహేష్ కి కథ కూడా వినిపించినట్టు చెప్పారు. అలాగే స్కంద 2 కూడా ఉంటుంది. దీంతో బోయపాటి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలు ఉన్నట్టే. మహేష్, సూర్య లని బోయపాటి ఎలా చూపిస్తాడో చూడాలి. రాజమౌళి – మహేష్ సినిమా తర్వాత బోయపాటితో ఉండొచ్చు. దీంతో ఈ హీరోల ఫ్యాన్స్ బోయపాటితో తమ హీరో సినిమా అనగానే మాస్ లెక్కలు వేసుకుంటున్నారు.