లిటిల్ మాస్టర్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ

ఓవరాల్ గా ఈ మ్యాచ్‍లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు (16 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి దుమ్మురేపాడు.

వరల్డ్ కప్‍లో తక్కువ బంతుల్లో వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

వరల్డ్ కప్‍లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లలో రోహిత్ (7) అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సచిన్ (6), రికీ పాంటింగ్ (5) లు ఉన్నారు.

ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సచిన్ పేరిట ఉన్న ప్రపంచకప్ రికార్డును బద్దలు కొట్టాడు.

క్రిస్‌ గేల్‌ అత్యధిక సిక్స్‌లు (553) రికార్డు ను బద్దలు కొట్టి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు (554) బాదిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

వన్డే ప్రపంచకప్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోరు చేసి నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ నిర్దేశించిన 273 టార్గెట్ ను  టీమిండియా 35 ఓవర్లలో2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.