పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునేటప్పుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.

పెట్రోల్, డీజిల్ డెన్సిటీ ఎంతుందో తప్పకుండా చెక్ చేయాలి.

డెన్సిటీ అంటే సాంద్రత. ఇంధనం(ఫ్యూయల్) యొక్క నాణ్యత అని కూడా చెప్పొచు.

ఇంధనం డెన్సిటీని కేజీ పర్ మీటర్ క్యూబ్(kg/m3) లెక్కిస్తారు.

పెట్రోల్ కి ఉండాల్సిన డెన్సిటీ 710/770 మధ్యలో ఉండాలి.

డీజిల్ కి ఉండాల్సిన డెన్సిటీ 820/860 మధ్యన ఉండాలి.

ఈ రీడింగ్ కు ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా ఇంధనం క్వాలిటీ బాగోలేదని అర్థం.

మీ వాహనం మైలేజ్ తగ్గుతుంది.

మీ వాహనం త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

చాలా బంకుల్లో ఈ వాల్యూ పెట్రోల్, డీజిల్ రెండింటికీ ఒకేలా ఉంటుంది. అది సరైంది కాదు.

ఈసారి మీరు పెట్రోల్, డీజిల్ పోయించేటప్పుడు డెన్సిటీ ఎంత ఉందో కచ్చితంగా చెక్ చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం ప్రతీ బంకు దీన్ని ఫాలో అవ్వాల్సిందే.

ఒకవేళ ఏదైనా బంకులో ఈ రీడింగ్ చూపించకపోతే అక్కడికి వెళ్లొద్దు.