Seetharam Sitralu : ‘సీతారాం సిత్రాలు’ మూవీ రివ్యూ.. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి లైఫ్ లో సక్సెస్ అయ్యాడా?

ఇటీవల కామెడీ ఎమోషన్ తో వచ్చి చిన్న సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కామెడీ ఎమోషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Seetharam Sitralu : ‘సీతారాం సిత్రాలు’ మూవీ రివ్యూ.. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి లైఫ్ లో సక్సెస్ అయ్యాడా?

Lakshman Bramarambika Seetharam Sitralu Movie Review and Rating

Seetharam Sitralu Movie Review : లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘సీతారాం సిత్రాలు’. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణచంద్ర విజయబట్టు సంయుక్త నిర్మాణంలో డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కిషోరి ధాత్రక్, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజారి, ఆకెళ్ల రాఘవేంద్ర.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సీతారాం సిత్రాలు సినిమా నేడు ఆగస్టు 30న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. శివ(లక్ష్మణ మూర్తి) కర్నూల్ దగ్గర ఒక చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ ఉంటాడు. రోజు మంచి మాటలని వాట్సాప్ స్టేటస్ లో పెడుతూ స్టేటస్ శివగా పేరు తెచ్చుకుంటాడు. లైఫ్ లో ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో టీచర్ పార్వతి(భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. దీంతో పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని అప్పులు కూడా చేస్తాడు శివ. కానీ పెళ్లికూతురు తండ్రి పెళ్లిని ఆపేస్తాడు. దీంతో ఏం చేయాలో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమవుతున్న శివకు తన తండ్రి చేసిన వీసీఆర్ వర్క్స్ చేసి అప్పులు తీర్చాలనుకుంటాడు. అసలు శివ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? శివ లైఫ్ లో సక్సెస్ అయ్యాడా? శివ పెళ్లి పార్వతితో జరిగిందా? వీసీఆర్ వర్క్స్ ఇప్పుడు ఎలా చూపించారు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Ustaad Bhagat Singh : పవన్‌ని కలిసాము.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ అప్పటికల్లా పూర్తిచేసేస్తాం..

సినిమా విశ్లేషణ.. ఇటీవల కామెడీ ఎమోషన్ తో వచ్చి చిన్న సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కామెడీ ఎమోషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మాములు అబ్బాయి లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకోవడం, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలనుకోవడం అనే మాములు పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు. సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ముఖ్యంగా మన ఇంట్లో శుభకార్యాలు ఒకప్పుడు వీసీఆర్ లో భద్రపరిచేవాళ్ళని, కాలక్రమంలో అవన్నీ మాయమయి ఇప్పుడు ఎలా ఉందో చూపించారు. అయితే వీసీఆర్ లో డేటా డిజిటల్ గా ఎలా మార్చారు అనేది బాగా చూపించారు. ఈ విషయంలో డైరెక్టర్ బాగానే హోమ్ వర్క్ చేసారు.

లవ్ స్టోరీ కూడా క్యూట్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్నేహితులు, బంధువులు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లవ్ లో ఫెయిల్ అయితే యూత్ ఎలా ఉంటున్నారు అని.. ఇలా రియల్ లైఫ్ సంఘటనలలాగే చూపించారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఎమోషన్ సీన్స్ ని ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఒక మాములు అబ్బాయి తన లైఫ్ లో వచ్చే సమస్యలతో పోరాడుతూ లైఫ్ లో ఎలా ఎదిగాడు అని ఎంటర్టైన్మెంట్ గా చూపించారు. సినిమాలో ఓ మెసేజ్ కూడా ఇచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. శివ పాత్రలో లక్ష్మణ్ మూర్తి మెప్పించాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో ఆకట్టుకున్న భ్రమరాంబిక ఇప్పుడు హీరోయిన్ గా క్యూట్ గా కనిపిస్తూనే టీచర్ పాత్రలో ఒదిగిపోయింది. సందీప్ వారణాసి తన కామెడీతో అక్కడక్కడా నవ్వించాడు. ఢిల్లీ రాజేశ్వరి, కిషోరి ధాత్రక్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. కథ, కథనం బాగానే రాసుకొని కొత్తవాళ్లతో తెరపై చూపించడంలో దర్శకుడు నాగ శశిధర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా నిర్మాతలు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సీతారాం సిత్రాలు’ సినిమా ఓ యువకుడు లైఫ్ లో ఎలా ఎదిగాడు, అతనికి ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి అని ఎంటర్టైన్మెంట్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.