UGC NET 2024 Result : త్వరలో యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ విడుదల.. డౌన్‌లోడ్ ప్రాసెస్ ఇదిగో!

UGC NET 2024 Result : నెట్ పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్ (csirnet.nta.ac.in) అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి స్కోర్‌కార్డ్‌లను యాక్సెస్ చేయగలరు.

UGC NET 2024 Result : త్వరలో యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ విడుదల.. డౌన్‌లోడ్ ప్రాసెస్ ఇదిగో!

UGC NET 2024 Result To Be Out Soon

UGC NET 2024 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR- NET) 2024 ఫలితాలు, అధికారిక ఆన్సర్ కీలను త్వరలో రిలీజ్ చేయనుంది. నెట్ పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్ (csirnet.nta.ac.in) అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి స్కోర్‌కార్డ్‌లను యాక్సెస్ చేయగలరు. జూలై 25, 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 348 కేంద్రాల్లో 187 నగరాల్లో పరీక్ష నిర్వహించగా, మొత్తం 2,25,335 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

ప్రొవిజనరీ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రం ఆగస్టు 8న రిలీజ్ అయింది. ఆగస్టు 9, ఆగస్టు 11 మధ్య ఛాలెంజ్ విండో ఓపెన్ అయింది. ప్రొవిజనరీ కీపై అసంతృప్తి చెందిన అభ్యర్థులు రూ. 200 రుసుము చెల్లించి తమ అభ్యంతరాలు తెలిపారు. ఒక్కో ప్రశ్నకు అభ్యర్థులు పంపిన అభ్యర్థనలను సబ్జెక్ట్ నిపుణుల బృందం ధృవీకరించింది. జవాబు కీ సవరించి తదనుగుణంగా అభ్యర్థులందరి ప్రతిస్పందనలకు రివైజ్ చేసిన ఆన్సర్ కీ ఆధారంగా తుది ఫలితాలను ప్రకటించారు.

అర్హత ప్రమాణాలివే :
2024 జూలైలో జరిగిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 33శాతం సాధించాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 25శాతం సాధించాలి.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ :

  • (csirnet.nta.ac.in)లో సీఎస్ఐఆర్ అధికారిక వెబ్‌పేజీకి వెళ్లండి.
  • “సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • నిర్దిష్ట వివరాలను ఎంటర్ చేయాల్సిన కొత్త పేజీకి మీరు రీడైరెక్ట్ అవుతారు.
  • వివరాలను సమర్పించండి. మీ ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీలతో పాటు డిస్‌ప్లే అవుతుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డౌన్‌లోడ్ చేయండి.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 :
భారతీయ యూనివర్శిటీ లేదా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) లేదా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ కోసం అభ్యర్థుల అర్హతను అంచనా చేసేందుకు ఈ పరీక్ష నిర్వహించారు.

Read Also : Jio PhoneCall AI : జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎప్పుడు వస్తుంది?