Pranayagodari Song : ప్రణయగోదారి సినిమాలోని ఐటమ్ సాంగ్ విన్నారా?

ఆల్రెడీ ప్రణయ గోదారి సినిమా నుంచి పలు సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని ఐటం సాంగ్ రిలీజ్ చేసారు.

Pranayagodari Song : ప్రణయగోదారి సినిమాలోని ఐటమ్ సాంగ్ విన్నారా?

Pranayagodari Movie Item Song Released by Ganesh Master

Pranayagodari Song : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ‘ప్రణయగోదారి’ అనే సినిమాతో రాబోతున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది.

Also Read : Nani – Bigg Boss 8 : బిగ్‌బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్‌కి గెస్ట్ గా హీరో నాని.. మరోసారి ఒకే స్టేజిపై ఇద్దరు హోస్ట్‌లు..

ఆల్రెడీ ప్రణయ గోదారి సినిమా నుంచి పలు సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని ఐటం సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటను మార్కండేయ రాసి సంగీతం అందించాడు. భార్గవి పిల్లై ఈ పాటను పాడింది. ఈ సాంగ్ లో మాధురి మొండాల్ నర్తించింది. మీరు కూడా ఈ ఐటెం సాంగ్ వినేయండి..

ఇక ప్రణయగోదారిలోని ఈ ఐటెం సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేసారు. పాట రిలీజ్ అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు… అనే ఐటెం సాంగ్ వినడానికి బాగుంది. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్స్ బాగున్నాయి. విఘ్నేశ్ గారు తెరకెక్కించిన ప్రణయ గోదావరి మంచి సక్సెస్ అవ్వాలి అని అన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Pranayagodari Movie Item Song Released by Ganesh Master