Glenn Maxwell : అరెరె.. మాక్స్‌వెల్ ది ప‌ళ్ల సెట్టా..? సీక్రెట్ బ‌య‌ట పెట్టిన మిచెల్ మార్ష్‌..

ఆస్ట్రేలియా క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, పాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ ఫన్నీ లై డిటెక్టర్ టెస్ట్‌లో పాల్గొన్నారు.

Glenn Maxwell : అరెరె.. మాక్స్‌వెల్ ది ప‌ళ్ల సెట్టా..? సీక్రెట్ బ‌య‌ట పెట్టిన మిచెల్ మార్ష్‌..

Australian Players Spill It All In Lie Detector Test

ఆస్ట్రేలియా క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ ల‌బుషేన్‌, మిచెల్ మార్ష్, పాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ ఫన్నీ లై డిటెక్టర్ టెస్ట్‌లో పాల్గొన్నారు. స‌ర‌దా కోసం చేసిన లై డిటెక్ట‌ర్ షోలో ప్లేయ‌ర్లు అంద‌రిని ఫ‌న్నీ ప్ర‌శ్న‌లు అడిగారు. స‌మాధానం స‌రైంది అయితే.. బజర్‌పై బ్లూ లైట్ , తప్పు సమాధానం రెడ్ లైట్ వెలుగుతుంది. కొన్ని సార్లు చిన్న పాటి క‌రెంట్ షాకులు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆటగాళ్లను వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగారు. స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు సంబంధించిన అనేక విష‌యాల‌ను ప్లేయ‌ర్లు వెల్ల‌డించారు. అయితే.. క్రికెట‌ర్లు ఏ స‌మ‌ధానం చెప్పిన కూడా త‌ప్పుగా చూపించ‌డంతో అంతా న‌వ్వేశారు.

Shreyas Iyer : నువ్వు సూప‌ర్ అయ్య‌ర్.. జ‌ట్టులో వేరే వాళ్ల‌కి ఛాన్స్ ఇచ్చేందుకు ఇంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నావా?

ఆస్ట్రేలియా 2023 వ‌న్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ట్రావిస్ హెడ్ 35 కంటే ఎక్కువ బీర్లు తాగారా ? అని హోస్ట్ ప్ర‌శ్నించ‌గా ట్రావిస్ హెడ్ లేదు అని స‌మాధానం ఇచ్చాడు. ఆ వెంట‌నే హెడ్‌కు చిన్న పాటి విద్యుత్ షాక్ త‌గిలింది. మీరు చెప్పేది అబ‌ద్ధం అని హోస్ట్ అన్నాడు. దీంతో హెడ్ ఒక్క‌సారిగా న‌వ్వేశాడు.

ఇక డేవిడ్ వార్నర్ లేకుండా ప్రస్తుత ఆస్ట్రేలియా జ‌ట్టు మంచి వాతావ‌ర‌ణం క‌లిగి ఉందా? అని ప్ర‌శ్నించ‌గా ఖ‌వాజా లేదు అని బ‌దులు ఇచ్చాడు. వెంట‌నే రెడ్ లైట్ వెలిగింది. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు మాక్స్‌వెల్ గోల్ప్ కార్డ్ లో యాక్సిడెంట్‌కు గురి అయ్యాడు. అత‌డు కార్ట్ వెన‌క నుంచి జారి ప‌డిపోయాడు. దీంతో అత‌డి త‌ల‌కు గాయం కావ‌డంతో ఆస్ట్రేలియా నిబంధ‌న‌ల ప్ర‌కారం అత‌డు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూరం అయ్యాడు.

Novak Djokovic : యూఎస్ ఓపెన్‌లో పెను సంచ‌ల‌నం.. 18 ఏళ్ల‌లో జ‌కోవిచ్ తొలి సారి ఇలా..

దీనిని ప్ర‌స్తావిస్తూ.. గోల్ప్ కార్డ్ నుంచి ప‌డిపోవ‌డం వెనుక ఏదైన సీక్రెట్ ఉందా? అని అడుగ‌గా.. ఆ స‌మ‌యంలో తాను అక్కడే ఉన్నాన‌ని, అలాంటిది ఏమీ లేద‌ని ఖ‌వాజా అన్నాడు. ఆ వెంట‌నే అత‌డికి షాక్ కొట్టిది. గేమ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం షాక్ కొట్ట‌డంతో అది అబ‌ద్దం అని హోస్ట్ అన్నాడు.

ఇదిలా ఉండగా.. మాక్స్‌వెల్‌కు సంబంధించిన ఓసీక్రెట్‌ను మిచెల్ మార్ష్ వెల్ల‌డించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ట‌ర్కీ వెళ్లి కొత్త ప‌ళ్ల సెట్‌ను మాక్స్‌వెల్ పెట్టించుకున్న‌ట్లు మిచెల్ వార్ష్ చెప్పాడు. అయితే.. ఇది కూడా అత‌డు స‌ర‌దాగానే చెప్పాడు.