Home » దారుణం : చెల్లెలు వరసయ్యే యువతిపై అత్యాచారం
Published
3 weeks agoon
A 19 year old girl is raped by young relative : రాను రాను ప్రజల్లో వావి వరసలు, మంచి చెడులు ఆలోచించే పరిస్ధితి లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకు పోయిన యువకుడు చెల్లెలు వరసయ్యే యువతితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ యువతి గర్బం దాల్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
దెందులూరు మండలం అలుగుల గూడెం ప్రాంతంలో వరసకు సోదరి అయ్యే యువతి(19) పై, యువకుడు(21) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. యువతికి రుతుక్రమం తప్పడంతో ఆమెను తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ఆమె జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతిగా నిర్ధారణ అయింది. తల్లిదండ్రులు వెంటనే దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార్ కేసు నమోదు చేసి , యువతి వద్ద నుంచి వివరాలు సేకరించారు.