A car ran over a woman near Chilla Village in Delhi yesterday

షాకింగ్ వీడియో : మహిళను CAR తో ఢీ కొట్టి..వెళ్లిపోయిన SI

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్న గల్లీ..ఆ దారిలో పాదాచారులు, వాహనాలు వెళుతూ..కొంచెం బిజీ బిజీగా ఉంది. ఓ ఆటో వెళుతుండగా..దాని వెనుక ఓ బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ కారును ర్యాష్ గా పోనిస్తూ…మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతం చిల్లా ప్రాంతంలోని గల్లీలో ఓ కారు అతి వేగంగా వచ్చింది. ఈ క్రమంలో మహిళను ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోయిన మహిళను లేపడానికి అక్కడనే ఉన్న స్థానికులు ప్రయత్నించారు. కానీ అందులో ఉన్న వ్యక్తి..కారును అదే పనిగా ముందుకు పోనిచ్చాడు.

దీంతో కార్ల టైర్ల కింద పడిపోయిన మహిళ విలవిలలాడింది. ఏ మాత్రం కనికరం లేకుండా…కారును ముందుకు పోనిచ్చిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. తీవ్ర గాయాలతో ఉన్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక కారులో ఉన్న వ్యక్తి ఓ SI అని తేలింది. ఇతను కారు నడిపే సమయంలో మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఇతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.

 

Read:వండర్..నీటి గ్లాసులతో గరగర తిప్పాడు…ఒక్క చుక్క నీళ్లు కిందపడలేదు

Related Posts