విశాఖ రాంకీ సాల్వెంట్ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం…మంటల్లో చిక్కుకున్న 65 మంది కార్మికులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ మంటల్లో 65 మంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

పరిశ్రమ నుంచి రెండు, మూడు కిలో మీటర్ల వరకు మంటలు కనిపిస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమీప పరిశ్రమలకు కూడా మంటలు విస్తరించే ప్రమాదం ఉంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. మంటలు ఎగిసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికీ 17 సార్లు పేలుడు శబ్ధాలు వినిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు సాల్వెంట్ పరిశ్రమలో సంభవించడంతో స్థానికులు భయాందోళకు గురవుతున్నారు.

విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో రసాయనిక మందుల తయారికీ ఉపయోగిపడే రసాయనాలను పెద్ద మొత్తంలో నిల్వ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే రసాయనాలు ఒకదాని వెంబడి మరోటి అంటుకోవడంతో దాదాపు 20 డ్రమ్ములకు పైగా అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు కార్మికులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పరవాడ, అనకాపల్లి, విశాఖ స్టీల్ ప్లాంటు, గాజువాక, విశాఖ సిటీ తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అగ్నిమాపక సిబ్బందిని ఘటనస్థలికి తరలించారు. రసాయనాలు ఇంకా మండుతూఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Related Posts