లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

హైదరాబాద్‌లో మందుబాబు దౌర్జన్యం..డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఐని బైక్ తో ఢీకొట్టాడు

Updated On - 1:10 pm, Tue, 23 February 21

man collided to SI with a bike while intoxicated : మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. మద్యం తాగి దర్జాగా రోడ్లపై వాహనాలు, బైక్ లను నడుపుతున్నారు. విచక్షణారహితంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇదేంటని అడిగిన వారిపై దాడికి తెగబడుతున్నారు. ఈ ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ అధికారిపైనే దాడి చేశాడు.

కూకట్‌పల్లిలో మందుబాబు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఐ రాజేశ్వర్‌ను బుల్లెట్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్‌ఐ రాజేశ్వర్‌ కాలుకు గాయం అయ్యింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన ఎస్ఐకి చికిత్స చేస్తున్నారు.