ఉల్క కోటీశ్వరుడిని చేసింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

A meteorite fell on this coffin maker’s house : శవ పేటికలు తయారు చేసే వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. ఉల్క కారణంగా కోటీశ్వరుడయ్యాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఉత్తర సుమత్రా లోని కోలాంగ్ ప్రాంతంలో జోసువా హుటలుంగ్ (33) శవ పేటికలు తయారు చేస్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఎప్పటిలాగే..ఆగస్టు నెలలో పని చేసుకుంటున్న సమయంలో..ఉన్నట్టుడి ఫుట్ బాల్ సైజులో ఉన్న ఉల్క ఆకాశం నుంచి రాలి పడింది. ఇంటి ఆవరణలో పడిపోవడంతో ఈ తాకిడికి ఇల్లు ఊగిపోయినట్లైంది. పడిపోయిన వస్తువును భార్యతో కలిసి పరిశీలించాడు. మట్టిలో ఉన్న దానిని తీసేందుకు ప్రయత్నించారు. వేడిగా ఉండి..పొగలు కక్కుతున్న దానిని బయటకు తీశారు.పడిపోయిన ఉల్క..అరుదైన రాయిగా భావించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీనిని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. సుమారు 450 కోట్ల ఏండ్ల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. గ్రహ శకలంలోని ప్రత్యేక అమైనో యాసిడ్స్ ఇతర మూలకాల ద్వారా జీవం పుట్టుకు గుట్టు తెలియవచ్చని అంతరిక్ష నిపుణులు భావిస్తున్నారు.బాలిలో నివాసం ఉండే..అమెరికాకు చెందిన రాక్ ఎక్స్ పర్ట్ జరెడ్ కొలిన్స్ , జోసుతో బేరసారాలు నడిపాడు. సుమారు 2.2 కిలోల బరువున్న ఉల్క రాయికి 1.4 మిలియన్ పౌండ్స్ (భారత కరెన్సీలో రూ. 13.75 కోట్లు) జోసువాకు చెల్లించాడు. ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడంతో జోసువా సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చిన డబ్బుతో చర్చిని నిర్మిస్తానని అంటున్నాడు

Related Tags :

Related Posts :