లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సినిమా చూసి మరీ కిడ్నాప్ ప్రాక్టీస్.. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం

Published

on

Boinpally kidnapping case : బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాపర్లు, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వ్యక్తుల్లా తయారై, ఐడీ కార్డులు ధరించి మరీ ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ కు యత్నించారు. దీనికి సంబంధించి ఓ స్కూల్ లో వాళ్లు ప్రాక్టీస్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కిడ్నాప్ కు సంబంధించి మరో కొత్త కోణం బయటపడింది.

హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఓ సినిమా చూసి మరీ కిడ్నాప్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేశారట. స్పెషల్ ఛబ్బీస్ అనే సినిమాలో అక్షయ్ కుమార్ అతడి గ్యాంగ్ ఐటీ అధికారుల్లా వచ్చి దోచుకుంటారు. ఆ సన్నివేశాలు చూసే ఐటీ ఆఫీసర్లలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారట కిడ్నాపర్లు. ఆ సినిమా చూసే రిహార్సల్స్ చేసినట్టు పోలీసుల విచారణలో బయపడింది.

భార్గవ్ సోదరుడు, అఖిలప్రియ మరిది చంద్రహాస్ ఈ రిహార్సల్స్ కార్యక్రమాలన్ని చూసుకున్నాడు. యూసఫ్ గూడలోని తనకు చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో కిడ్నాపర్లకు క్లాసులు తీసుకున్నడు. శ్రీనగర్ కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి డ్రెస్సులు తెప్పించడం, ఓ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి నకిలీ ఐడీ కార్డులు తయారుచేయించడం లాంటి పనులన్నీ ఇతడే చూసుకున్నాడు.

రెండో రోజు పోలీస్ కస్టడీలో భాగంగా అఖిలప్రియ ఈ విషయాల్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కాల్ డేటాకు సంబంధించి మాత్రం ఆమె మౌనం వహించారు. తను పెద్ద రాజకీయ నేతనని, చాలామంది ఫోన్లు చేస్తుంటారని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె మౌనంగానే ఉండిపోయారు.

ఈ కేసులో పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా ఆతన్ని విచారిస్తున్నారని సమాచారం. కాకపోతే ఆ విషయాన్ని పోలీసులు బయటకు వెళ్లడించడం లేదని తెలుస్తోంది. భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేశామనే విషయం బయటకు పొక్కిన అఖిలప్రియతో పాటు ఆల్రెడీ అరెస్టైన మిగతా వ్యక్తులంతా మరింత జాగ్రత్తపడతారనే ఉద్దేశంతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *