లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

కట్టెల పొయ్యి వంట పొగతో జాగ్రత్త.. మీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది!

Published

on

కట్టెల పొయ్యి వంట పొగతో జర జాగ్రత్త.. మీ ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తోంది ఓ కొత్త అధ్యయనం.. కట్టెల పొయ్యి నుంచి విడుదలయ్యే పొగలో ప్రాణాంతక విషవ్యర్థాలను పీల్చినవారిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని అధ్యయనంలో తేలింది.చెట్ల వ్యర్థాలతో వంట వండిన సమయంలో విడుదలయ్యే పొగతో వాయు కాలుష్యంతో పాటు ప్రాణాంతకమని అంటోంది. బయోమాస్ కుకింగ్ ఫైర్.. జీవ ఇందనం.. సాధారణంగా ఎండిన కుళ్లిపోయిన చెట్ల వ్యర్థాలను ఇంట్లో వంట కోసం వాడుతుంటారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వంట ఇందనంగా కట్టెల పొయ్యిపై ఆధారపడి జీవిస్తున్న వారు ఉన్నారు. ఎండు కట్టెలను మంటల్లో కాల్చడం ద్వారా విష వాయువులు విడుదల అవుతాయి.ఆ విష వాయువులు గాలిని కలుషతం చేస్తాయి. అలా కలుషితమైన గాలిని పీల్చినవారిలో క్రమంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అధ్యయనంలో రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల మంది ఇప్పటికీ వంట కోసం బయోమాస్ ఇందనాన్ని వినియోగిస్తున్నారు.

దీని కారణంగా ఏర్పడే వాయి కాలుష్యంతో చాలావరకు మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు వార్షికంగా 4 మిలియన్లు వరకు ఉంటుందని అంచనా. కట్టెల పొయ్యి పొగతో ఊపిరితిత్తులకు ప్రమాదం పొంచి ఉంది.

ఈ విషయంలో ప్రతిఒక్కరూ పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు లిక్విపపైయిడ్ పెట్రోలియం గ్యాస్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో పాటు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడంతో వంట గ్యాస్ ప్రయోజనాలేంటో తెలియడం లేదు. చాలా ప్రాంతాల్లో కట్టెల పొయ్యితోనే ఇప్పటికీ వంటలు వండుకుంటున్నారు. ఇండియాలో తాంజావూర్‌కు చెందిన 23మందిపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది.

వారి ఇంట్లోని గాలి నమూనాలను కూడా పరీక్షించారు. వంట పొగను పీల్చినవారిలో ఎంతమంది ఊపిరితిత్తులపై దెబ్బతిన్నాయో అధ్యయనం చేశారు. ఇందుకోసం స్పిరోమెట్రీ వంటి సాంప్రదాయక టెస్టింగ్ పద్ధతుల ద్వారా పాల్గొన్నవారిని స్కానింగ్ చేసి పరీక్షించారు.స్కానింగ్ సమయంలో వారిని గాలి పీల్చుకోవడం.. బయటకు వదలడం చేయాలని పరిశోధకులు సూచించారు. అప్పుడు వారిలో ఏమైనా మార్పులు జరిగాయా అనేది లోతుగా విశ్లేషిస్తారు. కట్టెల పొయ్యిలో వంట చేసేవారు ఎక్కువగా ఈ విషవాయవుల బారిన పడుతున్నారు.

అంతేకాదు.. రోజూవారీగా కట్టెల పోయ్యితో వంటలు వండేవారిని పరీక్షించగా.. కొంతమందిలో ఊపిరితిత్తుల్లో అనారోగ్య సమస్యలకు దారితీసిందని గుర్తించినట్టు తెలిపారు.కొంతమంది ఊపరితిత్తుల్లో అసాధారణ స్థితిలో టిస్సులో మార్పులు వచ్చినట్టు గుర్తించమాని పరిశోధకులు తెలిపారు. ఈ సబ్ గ్రూపులో 30శాతం మంది బయోమాస్ వినియోగదారుల్లో 50శాతానికి పైగా ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నాయని గుర్తించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *