అప్పుడే పుట్టిన ఆడశిశువును కెనాల్ లో పడేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని శిశువు తండ్రి ఆరోపిస్తున్నారు. కరోనా కారణంగా తమ బిడ్డను ఊరిలోకి తీసుకరావద్దని గ్రామస్తులు చెప్పడం వల్లే కెనాల్ లో పడేశామని చెబుతున్నారు.

నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ మహిళ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఆమె స్వాప్ తీసుకున్నారు. కరోనా టెస్టులు చేయాలని ఉదయం నుంచి రాత్రి 8.30 వరకు ఆస్పత్రిలో ఉంచుకుని, తర్వాత ట్రీట్ మెంట్ చేయడంతో కడుపులోనే శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మృతి చెందిన శిశువును ఊరిలోకి తీసుకెళ్తే గ్రామస్తులు అడ్డుకుంటారనే భయంతోనే కుటుంబ సభ్యులు కెనాల్ లోకి పడేసి వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడ శిశువు మృతి చెందిన తర్వాత ఊరిలోకి తీసుకెళ్తే అడ్డగిస్తారనే భయంతోనే కెనాల్ లోకి పారవేసినట్లు శిశువు తండ్రి చెబుతున్నట్లు తెలుస్తోంది.

Related Tags :

Related Posts :