ప్రాణాలు కాపాడుతున్న ప్లాస్మా థెరఫీ.. అందరికీ వాడొచ్చా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి ఎక్కించడమనేది దశాబ్దాల నాటి మాట. ZIKA, flu, Ebola, SARSలతో బాధపడేవారి శరీర రక్తంలో యాంటీ బాడీలుగా ఎక్కిస్తారు. తద్వారా కొంతవరకూ శరీరాల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఇది చాలా ఎఫెక్టబుల్ గా పనిచేస్తుంది. దీని వల్ల ఫలితాలు ఆశించినంత మేర రాకపోయినా వ్యాక్సిన్ లు లేని సమయంలో ఇదే ప్రత్యామ్నాయంగా ఉంది.

కొవిడ్-19 పేషెంట్స్ కు ట్రీట్‌మెంట్ ఇచ్చే క్రమంలో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఆశాజనక ఫలితాలు వస్తుండటంతో ప్లాస్మా థెరఫీకే మొగ్గుచూపుతున్నారు. ఇతర ట్రీట్‌మెంట్ల కంటే ఇది బెటర్. ఈ యాంటీబాడీలు అనేవి శరీరంలో తాత్కాలికంగా రోగనిరోధక శక్తిని మాత్రమే పెంచుతాయి. కొద్ది వారాల్లోనే వీటి ఎఫెక్ట్ తగ్గిపోతుంది. వ్యాధి నుంచి పోరాడటానికి సేఫ్టీగా ఉండటానికి ఇది సాయపడుతుంది.

కాలిఫోర్నియా శాన్ డీగో ప్లాస్మా థెరఫీపై ట్రయల్ లాంచ్ చేశారు. టెంపరరీ ఇమ్యూనిటీ కోసం యాంటీ బాడీలు పంపించే ప్రక్రియతో చాలామంది జబ్బు నుంచి బయటపడ్డారు. హై రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న 487 మంది టార్గెట్ రీచ్ అయ్యారు. వయస్సు రీత్యా, ఆరోగ్యం రీత్యా ప్రాణాలతో పోరాడుతున్న వారు గట్టెక్కగలిగారు.

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం.. ప్లాస్మా థెరఫీ ట్రీట్‌మెంట్‌గానూ, జాగ్రత్త చర్యగానూ ఉపయోగపడుతుంది. ఏప్రిల్ లో మరోసారి ట్రయల్స్ నిర్వహించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తొలి ప్రొఫిలాక్టిక్ ట్రయల్ ను మేలో స్టార్ట్ చేశారు. ఈ ప్లాస్మా అనేది పేషెంట్లకు సేఫ్ గా ఉంటుంది. ఈ థెరఫీ ట్రయల్స్‌లో 7వేల మంది పాల్గొన్నారు.

ఈ ప్రొఫిలాక్టిక్ ట్రయల్స్ పెద్ద ఆశ్చర్యపడేలా ఏం లేవు. వ్యాక్సిన్లతో తగ్గని ప్రొఫిలాక్టిక్ ట్రయల్స్ టైంను వెచ్చించేలా ఉంటాయి. వైరస్ ప్రభావం అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే ప్రభావవంతంగా పనిచేసింది. పేషెంట్లు ప్లాస్మా ట్రాన్సఫర్ కోసం కచ్చితంగా హెల్త్ కేర్ సెంటర్ కు వెళ్లాల్సిందే. దీని కోసం కొద్ది నిమిషాల సమయం పట్టడమే కాదు. వాలంటీర్ డోనార్ ల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. అందుకే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి, ఇన్ఫెక్షన్ సోకిన వయోవృద్ధులకు యాంటీబాడీలు ఎక్కించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Related Posts