దళితులను ఆలయంలోకి అనుమతించని పూజారి…దేవాలయం ఎదుట దళిత సంఘాల ఆందోళన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dalits protest : స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటాక కూడా దళితులపై వివక్ష కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో దళితులను అంటరానివారిగా చూస్తున్నారు. దేవాలయాల్లోకి రానివ్వడం లేదు. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో దళితులపై అమానుషం చోటుచేసుకుంది. దళితులను ఆంజనేయస్వామి ఆలయంలోకి పూజారి అనుమతించకపోవడంతో దేవాలయం ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. దళిత సంఘాల ఫిర్యాదుతో ఆలయ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు.ధర్మకంచెకు చెందిన లక్కపల్లి భాస్కర్ అనే వ్యక్తి తన కుమారుడు గగన్ వర్షకు పైపన్ను రావడంతో అరిష్టమన్న కారణంతో అక్కడున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి పూజారి ఆంజనేయ శర్మను శాంతి పూజ చేయాలని కోరారు. అయితే దళితులు కాబట్టి పూజ చేయం, ఈ ఆలయంలోకి రావొద్దని పూజారి అనడం వివాదంగా మారింది.అక్కడున్న పూజారిని స్థానికులు, దళితులు ప్రశ్నించడంతో వారితో పూజారి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. స్థానిక కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ నేతృత్వంలో దళితులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దళితులకు ఆలయ ప్రవేశం చేయకపోవడం, జిల్లా కేంద్రంలో ఉన్న ఆలయం పట్ల పూజారి ఈ రకంగా వ్యవహరించడం దారుణమని నిరసనకు దిగారు.పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లక్కపల్లి భాస్కర్ తోపాటు అక్కడున్న దళితులందరూ ఆంజనేయశర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారిని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి నిజా నిజాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related Tags :

Related Posts :