Home » రియల్ హీరోకి ఫాలోయింగ్ మాములుగా లేదు: హ్యుమానిటీ విభాగానికి సోనూసూద్ పేరు!
Published
2 months agoon
By
vamsiతను చేసే సాయం కారణంగా నయా మెస్సయ్యగా మారిన నటుడు సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా పాపులర్ అయ్యారు. సోనూసూద్… నిజంగా నువ్వు మనిషివి కావు దేవుడివి.. అనే జనం ఎక్కువయ్యారు.. సరదాకో.. సినిమా అప్డేట్లు ఇవ్వడానికో.. వాడుకునే ట్విట్టర్ కాస్తా.. సాయానికి మార్గంగా మారిపోయింది. పేదల కష్టాలను చూసి, వెంటనే నేనున్నా.. అంటూ ట్వీటేసి.. వారికి సాయం చేసేస్తూ ఉన్నాడు సోనూ సూద్.
లాక్డౌన్ కాలంలో వేలాది మంది వారి ఇళ్లకు వెళ్లాలంటే.. మార్గం తోచని పరిస్థితిలో సోనూ వారికి మార్గం అయ్యాడు. రైళ్లు, విమానాలు వేసి సొంత ఊళ్లకు పంపేశాడు.. విదేశాల నుంచి రప్పించేశాడు సినిమాల్లో విలన్.. తెలుగులో పెద్దగా క్రేజ్ ఏం లేదు. సినిమాలు చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే. అయితే ఇప్పుడు సోనూసూద్ అంటే హీరో. హీరోలను మించిన రియల్ హీరో. ఎంతోమందికి మంచి చేస్తున్న మెస్సయ్య.. ఆయన బయట కాలుపెడితే చూడడానికి పరిగెత్తే జనం… ఓ మాస్ హీరోకు ఏ మాత్రం తక్కువకాని ఫాలోయింగ్ ఇప్పుడు సోనూ సొంతం అయిపోయింది.
ఇదిలా ఉంటే మంచి చేస్తే నెత్తిన పెట్టేసుకునే మన తెలుగువాళ్లు కూడా సోనూకు ఇప్పుడు గుండెల్లో చోటిచ్చేశారు. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తీర్చిదిద్దిన శరశ్చంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏకంగా టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి సోనూసూద్ పేరును పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన సోనూసూద్.. ఇప్పుడు మా అమ్మ ఉంటే.. దీనిని చూస్తే ఎంతో సంతోషించేది అని అన్నారు.
అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన సోనూని కలవడానికి అభిమానులు భారీగా వచ్చారు. క్యారీవాన్ దగ్గరికి వచ్చి నానా హంగామా చేశారు. హైదరాబాద్ లవ్ అంటూ తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేశాడు.
Hyderabadi love ❤️ https://t.co/i71s016GXW
— sonu sood (@SonuSood) November 29, 2020
🙏Sonu Sood
Posted by Sarat Chandra IAS Academy on Thursday, 3 December 2020