లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Published

on

సఖినేపల్లి మండలం వి.వి.మెరకలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు తేల్చారు. ఈ మేరకు సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమలాపురం డీఎస్పీ మసూమ్ బాషా వివరాలను వెల్లడించారు. వి.వి మెరక ప్రగతినగర్ కు చెందిన ఉప్పు ప్రసాద్ (48) (జూన్ 2, 2020) మృతి చెందారు. కేసువదాసుపాలేనికి చెందిన రౌడీషీటర్ చొప్పల సుభాకర్ అలియాస్ శివ, తల్లి ఉప్పు ప్రశాంతి కలిసి తన తండ్రిని హత్య చేసినట్లు మృతుని కుమార్తె (జూన్ 24, 2020) సఖినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

ఉప్పు ప్రసాద్ తన ఇంటివద్దనే సోడా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనేపథ్యంలో అతని భార్య ప్రశాంతి, ప్రియుడు సుభాకర్ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరికీ మధ్యవర్తిగా వ్యవహిరిస్తున్న యడ్ల ప్రమీలారాణికి శివ మత్తు బిల్లలు తెచ్చి ఇచ్చేవాడు. వాటిని ప్రశాంతి తన భర్తకు ప్రతిరోజూ భోజనంలో కలిపి పెట్టేది. అలా అతడు అనారోగ్యానికి గురయ్యేలా చేశారు. (జూన్ 2, 2020)న రాత్రి తనకు అలసటగా ఉందని నిమ్మసోడా కావాలని భర్తను శాంతి అడిగింది. నిమ్మసోడా కోసం ఉప్పు ప్రసాద్ తన దుకాణంలోకి వెళ్లాడు.

అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సుభాకర్, అతని అనుచరులు నల్లి వెంకటనరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్ లు కలిసి ఉప్పు ప్రసాద్ మెడకు తువాలు చుట్టి కిందపడేశారు. అక్కడే ఉన్న సుభాకర్ వచ్చి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని కుర్చిలో కూర్చోబెట్టి వెళ్లి పోయారు. అనంతరం భార్య ఉప్పు ప్రశాంతి వచ్చి ఏమీ తెలియనట్లు హడావుడి చేయడంతో కుమార్తె స్థానికుల సహాయంతో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు సహజ మరణంగా భావించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

రెండు వారాల తర్వాత మృతుడి భార్య తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతుండగా కుమార్తె విని కుటుంబ సభ్యుల సహాయంతో స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని డీఎస్పీ తెలిపారు. మరో నిందితురాలు ప్రమీలారాణి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన ట్రెయినింగ్ డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మసూల్ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్, ఎస్సై సురేష్ లను జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందనలు తెలిపినట్లు వివరించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *