పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన మందుబాబులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

young man picked up police vehicle : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు ఏకంగా పోలీస్ వాహనాన్నే దొంగిలించాడు. పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనంలో పారిపోయేందుకు యత్నించాడు. అయితే ఈ క్రమంలోనే చోరీ చేసిన యువకుడు పోలీసు కారుకు యాక్సిడెంట్ చేశాడు. వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టాడు. పోలీసు పెట్రోలింగ్ చేసే ఇన్నోవా కారును దొంగిలించి పారిపోతుండగా సీఐ మరో వాహనంలో వెంబడించి అతన్ని పట్టుకున్నారు.నల్గొండలోని ఈదులగూడలో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వెంచర్ లో నలుగురు యువకులు మద్యం తాగుతూ కనిపించారు. పెట్రోలింగ్ చేస్తున్న సీఐ రమేష్ బాబు వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తున్న సమయంలో అందులోని ఓ యువకుడు సీఐ వాహనంలోకి ఎక్కాడు. కారును నడుపుకుంటూ కోదాడ వైపు వెళ్లాడు. కారును వేగంగా నడపటంతో డివైడర్ ను ఢీకొట్టాడు.దీంతో ఆ యుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతనిపై సంబంధిత సెక్షన్లు నమోదు చేశారు. ఏకంగా పోలీస్ వాహనాన్నే దొంగిలించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Related Tags :

Related Posts :