లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలం అయ్యింది’.. ఎమోషనల్‌గా ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్..

Published

on

A1 Express: సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 25 వ సినిమా ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’.. తెలుగులో హకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. లావణ్య త్రిపాఠి కథానాయిక.. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్‌ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సందీప్ హాకీ క్రీడాకారుడిగా కనిపించడానికి చాలా బాగా మేకోవర్ అయ్యాడు. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

A1 Express

‘‘మన దేశంలో స్పోర్ట్స్ మెన్ కివ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా దొరకట్లేదు సార్.. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఏ స్పోర్ట్ చూడాలో ఏ స్పోర్ట్ చూడకూడదో కూడా బిజినెస్ మెన్ ఏ డిసైడ్ చేస్తున్నారు.. అసలు ఇక్కడ ఆడాలంటేనే ఎంతోకొంత డబ్బులు ఇవ్వాల్సొస్తుంది సార్..’’ అంటూ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేస్తున్నాయి.. ‘‘ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే ఇంకా షారుఖ్ ఖాన్ అనే అనుకుంటున్నారయ్యా బాబు..’’ అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్ నవ్విస్తుంది.
ఫిబ్రవరిలో ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’ థియేటర్లలోకి రానుంది.