‘ఆకాశం నీ హద్దురా’: సూర్య సినిమాకి బయ్యర్ల పోటీ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Aakasam Nee Haddura: వెర్సటైల్ యాక్టర్ సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన Soorarai Pottru..‘ఆకాశం నీ హద్దురా’ ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. సూర్య, అపర్ణల నటన, దర్శకురాలు సుధ కొంగర టేకింగ్‌కి సినీ ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది.

లాక్‌డౌన్ హిట్
లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ సూర్య సినిమా ఓటీటీలకు ఊరటనిచ్చింది. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ సినిమాను కచ్చితంగా చూసి తీరాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.


ఈ సినిమాతో అమెజాన్‌కి స‌బ్‌స్క్రెబ‌ర్లు కూడా పెరుగుతున్నారని సమాచారం. మరోవైపు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిసెంబర్‌లో థియేటర్లలో
కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు రాబోతున్నాయి. డిసెంబర్ మొదటివారంలో థియేటర్లు ఓపెన్ చేస్తే అప్పటికి రిలీజ్ చేయడానికి కొత్త సినిమాలేవీ ఉండవు కాబట్టి (విడుదల కాని సినిమాల విషయంలో క్లారిటీ లేదు కనుక).. ఓటీటీలో రిలీజైన సినిమాలనే థియేటర్లలో ప్రదర్శిస్తారు.

ఇప్పటికే ‘వి’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలను ప్రదర్శించాలని భావించిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు సూర్య సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తెలుగు హక్కుల కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగో ఓటీటీలో రిలీజైన సినిమా కాబట్టి తక్కువ రేటుకే సినిమా దొరకచ్చనేది బయ్యర్ల ఆలోచన.


చరణ్‌తో దివాళీ.. మంచు లక్ష్మీ భాయ్ దూజ్!


అప్పుడు వద్దన్నవారే
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమలో థియేటర్ల యాజమాన్యంతో సహా కొందరు వివాదం చేసినా, వాళ్లందరినీ ఎదిరించి, ఓ‌టీటీలోనే రిలీజ్ చేశారు సూర్య. ఇప్పుడు వాళ్లే సూర్య సినిమాను థియేటర్లో విడుదల చేయడానకి ముందుకు రావడం పైగా పోటీ పడడం విశేషం.


నిర్మాతల పంట పండింది
ఇక ఇప్పటికే ఈ సినిమాని లాభానికి అమ్ముకున్న నిర్మాతలకు ఈ థియేట్రికల్ రైట్స్ మీద వచ్చేదంతా కూడా బోనసే అవుతుంది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యనే ఈ సినిమా నిర్మించారు. ఎలాగూ తెలుగులో సూర్యకి మంచి ఫాలోయింగ్ ఉంది.

పైగా సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది. కాబట్టి జనాలు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఉన్నారు బయ్యర్లు. డిసెంబర్‌లో థియేటర్లు తెరుచుకుంటే ఎక్కువ థియేటర్లలో సూర్య సినిమా కనిపించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు తమిళ్, తెలుగులో ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశముంది.

Related Tags :

Related Posts :