‘ఆకాశం నీ హద్దురా’ OTT రిలీజ్!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Akaasam Nee Haddhu Ra on OTT: సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు హీరో సూర్య ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. మూత‌ప‌డ్డ థియేట‌ర్స్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.దీంతో చివ‌ర‌కు ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రాన్ని అమెజాన్‌లో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా న‌టించారు. ఎయిర్ డెక్క‌న్ అధినేత గోపీనాథ్ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్ర‌మిది. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది.


Related Tags :

Related Posts :