Abdullahpurmet tahsildar burnt alive case

అసలేం జరిగింది : ఆఫీస్ లోనే తహశీల్దార్ ను తగలబెట్టేశాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి వచ్చిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు. తహశీల్దార్ ఆఫీస్ లోనే ఈ ఘాతుకం జరిగింది.

రంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్ సజీవ దహనం ఘటన కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్ లోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒక్కసారిగా ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన విజయ.. కారిడార్ లో కుప్పకూలారు. కాసేపటికే చనిపోయారు. తహశీల్దార్ ఆఫీస్ రోడ్డుపైనే ఉంటుంది. ఈ ఘటన ఆఫీస్ సిబ్బందిని, స్థానికులను షాక్ కు గురి చేసింది. తహశీల్దార్ తో మాట్లాడాలి అంటూ లోనికి వచ్చిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో ఈ ఘటన జరిగింది. తహశీల్దార్ ని కలవాలని వచ్చిన  వ్యక్తిని అటెండర్  కాసేపు ఆపాడు. తహశీల్దార్ విజయ లోనికి పంపమని చెప్పడంతో అటెండర్ ఆ వ్యక్తిని లోనికి పంపాడు. ఆ వ్యక్తి తహశీల్దార్ విజయతో అరగంట సేపు మాట్లాడాడు. అరగంట  తర్వాత… . లోపలి నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడ్డాయి. లోనికి వెళ్ళిన వ్యక్తి తహసిల్దార్ పై పెట్రోల్ పోసి  నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ బయటకు పరుగులు తీశాడు. ఆమెని కాపాడేందుకు ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరం మొత్తం మంటలు వ్యాపించడంతో విజయ స్పాట్ లోనే చనిపోయారు” అని పోలీసులు వెల్లడించారు.

READ  వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ నుంచి పెట్రోల్ రేట్ల పెరుగుదల

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. ఇది తెలిసిన వ్యక్తి పనేనా లేక పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాస్ బుక్కులు పంపిణీ చేసింది. దీనికి సంబంధించి గొడవలు ఏమైనా జరిగాయ. లేక భూతగాదాలు కారణమా. అసలు తహశీల్దార్ ని సజీవ దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది… ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Related Posts