లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

నుదిటిపై వింత కన్నుతో పుట్టిన గొర్రెపిల్ల

Published

on

Abnormal Goat Kid నుదిటిపై రెండు కళ్లు అతుక్కొని ఓ గొర్రె పిల్ల అసాధారణంగా జన్మించింది. గొర్రెపిల్ల నుదిటిపై పెద్ద కనుబొమ్మ ఉండగా.. రెండు కళ్లు అందులోనే అమరాయి. ఉత్తరప్రదేశ్​లోని బిజ్​నోర్​ జిల్లాలోని మొరాహత్ అనే గ్రామంలో ఈ వింత జరిగింది. ఈ గొర్రెపిల్లని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వందలాదిగా తరలివస్తున్నారు. అదేవిధంగా, ఈ గొర్రె పిల్ల నోరు సైతం వంకరగా తిరిగి ఉంది. ముక్కు సైతం కనబడని విధంగా ఉంది. దీంతో చూసేందుకు దాని ముఖం అసలు గొర్రెపిల్లలా లేదు. ఈ వింతను తిలకించేందుకు చాలా మంది ఆ గ్రామానికి వెళుతున్నారు.

మొరాహత్ గ్రామవాసి మాసియా మాట్లాడుతూ..రెండు రోజుల క్రితం ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వింతగా గొర్రె పిల్ల జన్మించిందనే వార్త క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. దాన్ని చూసేందుకు జనాలు వస్తూనే ఉన్నారు. కొందరైతే ఇది మూడో కన్ను అని, ఈ గొర్రెపిల్ల శివుడి అవతారమని అంటున్నారు. మరికొందరు ఏకంగా పూజలు చేసేస్తున్నారు. ఇది దేవుడు ఇచ్చిన వరమని తాను కూడా నమ్ముతున్నట్టు మాసియా తెలిపారు.

అయితే అలా అసాధారణంగా జన్మించిన జంతువులు సాధారణంగా ఎక్కువ కాలం జీవించలేవని ఆ ప్రాంతానికి చెందిన వెటర్నరీ డాక్టర్ పుష్కర్ రాఠి తెలిపారు. జన్యు మార్పుల కారణంగా ఈ మధ్య కాలంలో ఇలా జంతువులు వింతగా పుడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.